షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ లేడీ సూప‌ర్ స్టార్

Thu,December 6, 2018 11:25 AM
Manju Warrier Injured During The Shoot

మాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ మంజూ వారియ‌ర్ ప్రస్తుతం సంతోష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో కాలిదాస్ జ‌య‌రామ్ హీరోగా న‌టిస్తున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కింస్తుండ‌గా మంజూ వారియ‌ర్ గాయ‌ప‌డింది. దీంతో వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు చిత్ర బృందం. అయితే త‌ల‌కి బ‌ల‌మైన గాయం కావ‌డంతో కుట్లు కూడా వేశార‌ట‌. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని చిత్ర బృందం తెలిపింది. ఈ అమ్మ‌డు కిట్టిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండ‌గా, భారీ చిత్రం ఓడియ‌న్ డిసెంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మోహన్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మ‌రో చిత్రం లూసిఫ‌ర్‌లోను మంజూ వారియ‌ర్ , మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో రానుంది.

3488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS