సెంచ‌రీ కొట్టిన బిగ్ బాస్.. ఈ వారం నామినేష‌న్‌లో అంద‌రు

Tue,September 18, 2018 09:10 AM
Manic Monday in bigg boss house

నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 సోమ‌వారం ( సెప్టెంబ‌ర్ 17)తో విజ‌యవంతంగా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఒక్క బిగ్ బాస్ హౌజ్‌లో 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభ‌మైన ఈ షో మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం ఇంట్లో కేవ‌లం ఆరుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. ఫైన‌ల్‌లో ఐదుగురు స‌భ్యులు పోటీ ప‌డ‌నుండ‌గా , వ‌చ్చే వారం ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు. ఇక వందో ఎపిసోడ్ హైలైట్స్ విష‌యానికి వ‌స్తే హౌజ్‌లో త‌నీష్‌, కౌశ‌ల్ మ‌ధ్య బంధం గురించి కాసేపు డిస్క‌ష‌న్ జ‌రిగింది. బంధాలు ఉంటే గేమ్ స‌రిగా ఆడ‌లేమ‌ని కౌశ‌ల్ చెప్ప‌గా, నేను గేమ్ వ‌ర‌కు మాత్ర‌మే ఆ బంధాల‌కి వ్య‌తిరేఖం అని తనీష్ అన్నాడు.

గీతా మాధురి.. రోల్‌ని పిలిచి చెవిలో గుస‌గుస‌లాడుతుఉండ‌గా, బిగ్ బాస్ గీతాకి వార్నింగ్ ఇచ్చారు. మీకు మైకులిచ్చిందే బ‌య‌ట‌కి వినప‌డేలా మాట్లాడ‌మ‌ని, ఇలా చెవిలో మాట్లాడటం ఏంట‌ని బిగ్ బాస్ ప్ర‌శ్నించ‌గా, నేను రోల్‌కి చెప్పిన ప‌దం బ‌య‌ట‌కి చెప్పిది కాదు. అందుకే చెవిలో చెప్పాల్సి వ‌చ్చింద‌ని గీతా క‌వ‌రింగ్ చేసుకుంది. ఈ విష‌యంలో కౌశ‌ల్ క‌లుగ‌జేసుకొని గుస‌గుస‌లాడటం గేమ్‌కి విరుద్ధం అని అన‌డంతో మీరు బిగ్ బాస్‌నే త‌ప్పు ప‌ట్టారు. మ‌రి దానికి ఏమంటారు. ఏమైన ప్ర‌తి దానికి మీరు రెడీగా ఉంటారే అంటూ గీతా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇక ఆత‌ర్వాత బాగ్ బాస్ ఇంటి స‌భ్యులకి స‌రికొత్త టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌లు బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న స్టోరీలను కవర్ చేయాలని.. వారు కవర్ చేసిన స్టోరీలను తరువాత ప్లే చేసి చూపిస్తామని.. అప్పుడు ఆ స్టోరీ వివరాలను తెలియజేయాల్సి ఉంటుందన్నారు బిగ్ బాస్.

టాస్క్‌లో రోల్ రైడా రిపోర్ట‌ర్‌గా, ఫోటోగ్రాఫ‌ర్‌గా సామ్రాట్‌లు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ తెలిపారు. రోజు మొత్తంలో రిపోర్టర్స్ మ‌రియు ఫోటోగ్రాఫ‌ర్‌లు ఐదు స్టోరీలు తీయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. స్టోరీల‌ని వినోద‌భ‌రితంగా చేయాల్సి ఉండ‌గా, ఇంట‌ర్వూ తీసుకున్న స‌మ‌యంలో త‌ప్ప వారిని మిగ‌తా ఇంటి స‌భ్యులు ప‌ట్టించుకోవ‌లసిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. గేమ్‌లో భాగంగా రోల్‌, సామ్రాట్‌లు టాస్క్‌లోకి ఇన్వాల్స్ అయ్యారు. రాత్రి పూట కౌశ‌ల్ గుడ్ల‌గూబ క‌ళ్ళు వేసుకొని అంద‌రి క‌ళ్ళు మూసి ఆయ‌న క‌ళ్లు తెర‌చుకొని గుడ్లు తింటున్నాడు. త‌మ నిఘా టీం ఈ విష‌యాన్ని బ‌ట్ట బ‌య‌లు చేస్తుంద‌ని చెప్పారు రోల్‌.

ఇక టాస్క్ జ‌రుగుతున్న క్ర‌మంలో కౌశ‌ల్ పేపర్ మీద ఏదో రాస్తున్న‌ట్టు క‌నిపించాడు. రాయ‌డం పూర్తైన త‌ర్వాత ఆ పేప‌ర్‌ని పాకెట్‌లో పెట్టుకోగా, బిగ్ బాస్ ఆ పేప‌ర్‌ని స్టోర్ రూంలో పెట్టాల‌ని ఆదేశించారు. ప‌ర్స‌న‌ల్‌గా రాసుకున్న పేప‌ర్ త‌న ద‌గ్గ‌రుంద‌ని కౌశ‌ల్ చెప్ప‌డంతో దానిని కూడా స్టోర్ రూంలో పెట్టాల‌ని బిగ్ బాస్ అన్నారు. అయితే తాను ఏం రాశారో, ఎందుకు రాస్తున్నారో బిగ్ బాస్ కి చెప్పాల‌ని కౌశ‌ల్‌ని కోర‌గా 100 రోజుల ఎపిసోడ్‌లలో జరిగిన 14 టాస్క్‌లు గురించి... ఎవరు ఎప్పుడు ఎలిమినేషన్ అయ్యారు? హౌస్ మేట్స్ మీద అభిప్రాయాలను రాసుకున్నానన్నారు. అయితే ఇది బిగ్ బాస్ హౌస్ నియమాలకు విరుద్ధం అన్నారు బిగ్ బాస్.

ఇలా చేయ‌డం బిగ్ బాస్ నియ‌మాల‌ని ఉల్లంఘించ‌డం అనే విష‌యం మీకు తెలియ‌దా అని బిగ్ బాస్ .. కౌశ‌ల్‌ని ప్ర‌శ్నించ‌గా, ఇంకో సారి ఇలా చేయ‌న‌ని అన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు గడిచినా కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇంటి నియ‌మాల గురించి త‌ర‌చుగా మాట్లాడే మీరు ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు. అలాగే గీతా మాధురి మైక్‌కి చేయి అడ్డుపెట్టి చెవిలో గుసగుసలాడుతుంది. మిగిలిన సభ్యులు కూడా ఇంటి నియమాలని ఉల్లంఘిస్తున్నారు. ఇకపై ఇంట్లో ఏ స‌భ్యుడిన నియ‌మాలని ఉల్లంఘిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు బిగ్ బాస్.

ఈ సీజ‌న్‌లో ఆఖ‌రి నామినేష‌న్ ప్ర‌క్రియ ఈ రోజు మొద‌లవుతుంద‌ని చెప్పిన బిగ్ బాస్ , ఆఖ‌రి మూడు వారాలు కెప్టెన్ లేకుండా ఉన్నారు. బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారా కాగా , ఇంటి సభ్యులు అందరూ టిక్కెట్ టు ఫినాలే లాంటి టాస్క్ మ‌రియు మిగిలిన టాస్క్‌లు, కెప్టెన్సీ టాస్క్‌ల ప్రాధాన్యతను గుర్తించకుండా సిల్లీగా ఆడినందుకు శిక్షగా హౌస్‌లో ఉన్న వాళ్లందరిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్న‌ట్టు తెలిపారు బిగ్ బాస్. రాబోయే రెండు వారాల‌లో ఇంటి స‌భ్యులు ఆట ప్రాముఖ్య‌త‌ని అర్ధం చేసుకుంటారని బిగ్ బాస్ అన్నారు.

మీరు రాయడం వ‌ల‌నే ఇదంతా జ‌రిగింద‌ని రోల్‌.. కౌశ‌ల్‌ని అడ‌గ‌గా, నా ఒక్క‌డి వ‌ల‌న‌నే ఇదంతా జ‌ర‌గ‌డం క‌రెక్ట్ కాద‌ని కౌశ‌ల్ అన్నాడు. కారు టాస్క్‌లో సంచాల‌కుడిగా ఉన్న మీరు స‌రిగా ఆడ‌లేద‌ని త‌నీష్‌, రోల్‌, సామ్రాట్‌లు కౌశ‌ల్‌పై యుద్ధానికి దిగారు. ఇది తారా స్థాయికి చేరుకుంది. ఎవరికైనా ఎలిమినేషన్‌ నుండి మినహాయింపు వస్తుంటే సంచాలకుడిగా ఉన్న మీరు కావాలనే అడ్డుకున్నారంటూ ఫైర్ అయ్యారు తనీష్. ఇక మిగిలిన దీప్తి, గీతా, రోల్, సామ్రాట్ మూకుమ్మడి దాడికి ప్రయత్నించారు. కారు టాస్క్‌లో మీరు సంచాలకుడిగా విఫలం అయ్యారంటూ వాదనకు దిగారు. ఈ క్ర‌మంలో మిగతా వారు పాత సంగ‌తుల‌ని గుర్తు చేస్తూ ఇంట్లో రచ్చ‌చేశారు. బిగ్ బాస్‌ని మీరు తిట్ట‌డం క‌రెక్ట్‌, మేము మాట్లాడితే త‌ప్పా అంటూ ఎదురు దాడి చేశారు. మొత్తానికి ఈ వారం అంద‌రు నామినేషన్‌కి ఎంపిక కావ‌డంతో హ‌జ్‌లో ర‌చ్చ జ‌రిగింది.

పాత గాయాల్ని గుర్తు చేసుకుంటూ కౌశ‌ల్‌పై మూకుమ్మ‌డి దాడి చేయ‌డంతో వందో ఎపిసోడ్ చాలా చాలా హాట్ హాట్‌గా న‌డిచింది. ఈ విష‌యాల‌ని రిపోర్ట‌ర్‌గా ఉన్న రోల్ కెమెరా ముందుకు వ‌చ్చి చెప్పాడు. మొత్తానికి ఈ వారం అంద‌రు ఎలిమినేష‌న్‌కి నామినేష‌న్ కాగా, రానున్న రోజుల‌లో ఇంటి స‌భ్యులు త‌మ గేమ్స్‌ని ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఆడి తుదివ‌ర‌కు నిలుస్తారో చూడాలి.

3226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles