మ‌ణిర‌త్నం మ‌ల్టీ స్టార‌ర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్‌

Sat,February 10, 2018 11:32 AM
Mani Ratnam  movie title fixed

ఆణిముత్యాల్లాంటి సినిమాల‌తో అభిమానుల‌ని అల‌రిస్తున్న మ‌ణిర‌త్నం చివ‌రిగా చెలియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. త‌దుప‌రి ప్రాజెక్ట్‌గా మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేయ‌గా, కొద్ది రోజుల నుండి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తమిళ్‌లో ‘చెక్కవంద వానమ్‌’ (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి తెలుగులో ‘నవాబ్‌’ అని ఫిక్స్ చేశారు. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ మూవీ రూపొందనుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నుండ‌గా, సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేయ‌నున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 12న‌ ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌ని టీం భావిస్తుంది. చిత్రంలో ఇద్ద‌రు హీరోలు అన్న‌ద‌మ్ములుగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌ణిర‌త్నం- అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో వచ్చిన రోజా, ద‌ళ‌ప‌తి, బొంబాయి మరియు కాద‌ల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక విజ‌య్ సేతుప‌తి, శింబుల‌తో ప‌నిచేయ‌డం మ‌ణిర‌త్నంకిదే తొలిసారి.



1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles