మ‌ణిర‌త్నంకి గుండెపోటు అనే వార్త‌ల‌పై వ‌చ్చిన క్లారిటీ

Fri,July 27, 2018 09:35 AM
mani ratnam is safe now

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. మేలిమి ముత్యాల్లాంటి సినిమాల‌ని తీసిన ఆయన ప్ర‌స్తుతం న‌వాబ్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. త‌మిళంలో ఇది ‘చెక్క చీవంత వాణం’ అనే పేరుతో రూపొందుతుంది. అయితే నిన్న సాయంత్రం మ‌ణిర‌త్నంకి గుండె పోటు రావ‌డంతో హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించాని, వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నట్టు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేశాయి. ఇది విన్న అభిమానులు, సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆరాలు తీశారు. ఈ క్ర‌మంలో మ‌ణిర‌త్నం ప్రతినిధులు వివ‌ర‌ణ ఇచ్చారు. సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల‌లో భాగంగానే ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్ళార‌ని, గుండెపోటు వ‌చ్చింద‌నే వార్త‌లు అవాస్త‌వం అంటూ పుకార్ల‌ని కొట్టి పారేశారు. మ‌ణిర‌త్నంకి గుండెపోటు ఏం రాలేద‌ని ప్ర‌తినిధులు చెప్ప‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మ‌ణిరత్నం నిర్మిస్తున్న న‌వాబ్ చిత్రంలో అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

2347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles