రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి మణిరత్నం

Mon,June 17, 2019 02:25 PM
Mani Ratnam is back to work after being hospitalised


ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గతేడాది గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. వైద్య నిపుణుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకున్న తర్వాత మణిరత్నం తిరిగి కోలుకున్నారు. అప్పటి నుంచి మణిరత్నం రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నారు. అయితే తాజాగా మణిరత్నం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు మీడియా ప్రొఫెషనల్ లోకేశ్ జెయ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు.

అయితే అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మణిరత్నం వ్యక్తిగత ప్రతినిధి నిక్కిల్ సూచించారు. రెగ్యులర్ చెకప్ కోసమే మణిరత్నం ఆస్పత్రిలో చేరానని, చెకప్ పూర్తవగానే ఆయన తిరిగి తన పనిలో చేరిపోయారని నిక్కిల్ ట్వీట్ చేశాడు. నిక్కిల్ ట్వీట్‌తో మణిరత్నం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

1426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles