ఈ సారి మంచు వార‌బ్బాయితో అదృష్టం ప‌రీక్షించుకోనున్న వైట్ల‌

Thu,February 21, 2019 08:52 AM
Manchu Vishnu team up with Sreenu Vaitla

శ్రీను వైట్ల ఒక‌ప్పుడు టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కి కామెడీ జోడించి ప్రేక్ష‌కుల‌ని మెప్పించిన శ్రీను వైట్ల‌కి కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్‌లు రావ‌డం లేదు. మ‌హేష్ బాబు ఆగ‌డు సినిమా నుండి నిన్న వ‌చ్చిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాల వ‌ర‌కు అన్ని ఫ్లాపుల‌గానే మిగిలిపోయాయి. అయిన‌ప్ప‌టికి ప‌డిలేచే కెరటంలా మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ముందుకు వెళుతున్నాడు శ్రీను వైట్ల‌. త్వ‌ర‌లో ఆయ‌న మంచు విష్ణుతో క‌లిసి ఓ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌ని ప్లాన్ చేశాడ‌ట‌. శ్రీను వైట్ల‌- విష్ణు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఢీ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి సినిమానో లేదంటే దానికి సీక్వెల్‌గా ఓ సినిమా తీసి మంచి హిట్ కొట్టాల‌ని వీరిద్ద‌రు భావిస్తున్నార‌ట‌. విష్ణుకి కూడా కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్‌లు లేవనే సంగ‌తి తెలిసిందే. మరి తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles