HomeLATEST NEWSManchu Vishnu funny tweets viral

త‌న భార్య ద‌గ్గ‌ర కాజ‌ల్‌ని ఇరికించిన విష్ణు

Published: Fri,August 9, 2019 01:07 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
కొద్ది రోజులుగా వెండితెర‌కి దూరంగా ఉంటున్న మంచు విష్ణు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి ట‌చ్‌లో ఉంటున్నాడు. అప్పుడ‌ప్పుడు త‌న ప‌ర్స‌న‌ల్‌, ఫ్యామిలీ విష‌యాల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే విష్ణు తాజాగా త‌న భార్య విరోనికా డెలివ‌రీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెడ‌తాన‌ని అన్నాడు. ఈ స‌ల‌హా త‌న‌కి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇచ్చింద‌ని ట్వీట్ లో తెలిపాడు విష్ణు. చాలా ఆలోచ‌న‌లు, చ‌ర్చ‌ల త‌ర్వాత నా భార్య డెలివ‌రీని కాజ‌ల్ స‌ల‌హాతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విరోనికా మ‌రో బేబికి జ‌న్మ‌నివ్వ‌బోతుంది. థ్యాంక్స్ కాజ‌ల్. నీ స‌ల‌హా నాకు ఎంతో నచ్చింద‌ని పేర్కొన్నాడు విష్ణు

మంచు విష్ణు ట్వీట్‌కి అత‌ని భార్య స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మిమ్మ‌ల్ని ఇద్ద‌రిని మామ‌లుగా కొట్ట‌ను. ఇందులో ఎలాంటి నేరం లేదు అని విరానికా తెలిపింది. దీనికి విష్ణు.. కొన్ని హింసాత్మ‌క బెదిరింపుల వ‌ల‌న ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాల‌నే ఆలోచ‌న విర‌మించుకున్నాను. ఆమెకి మోహ‌న్ బాబు స‌పోర్ట్ ఉండ‌డంతో నిర్ణ‌యం మార్చుకోక త‌ప్ప‌లేదు అని స‌ర‌దా కామెంట్స్ చేశాడు విష్ణు. ఇక జోకుల‌ని ప‌క్క‌న పెడితే విరానికా ఈ రోజు మ‌రో బేబికి జ‌న్మ‌నివ్వ‌బోతుంది. కొద్ది సేప‌టి క్రితం హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశాం. మంచి కోసం ప్రార్ధిస్తున్నాము అని విష్ణు పేర్కొన్నాడు.

న‌టుడు, నిర్మాత మరియు ఎడ్యుకేషనలిస్ట్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన విష్ణు 2009 మార్చిలో విరానిక‌ని వివాహం చేసుకున్నాడు. డిసెంబ‌ర్ 2011లో ఈ దంప‌తుల‌కి ట్విన్స్ జ‌న్మించారు.వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టాడు. ఇక 2018లో వారికి మ‌రో బిడ్డ జ‌న్మించాడు. ఆ చిన్నారికి అవ్రామ్ భక్త అని పేరు పెట్టారు. అవ్రామ్ అంటే ఎవరు ఆపలేరని అర్ధమని విష్ణు తెలిపాడు. త‌న భార్య విరానిక‌తో క‌లిసి న్యూయార్క్‌లోని బ్లూక్లిన్ బ్రిడ్జ్‌పై దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. తాను నాలుగోసారి తండ్రి కాబోతున్నట్టు మేలో తెలిపాడు విష్ణు. ఓట‌ర్ సినిమాతో మంచు హీరో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

35568
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology