కేసీఆర్ తెలంగాణ గాంధీ: మంచు మ‌నోజ్‌

Wed,September 13, 2017 03:39 PM
కేసీఆర్ తెలంగాణ గాంధీ: మంచు మ‌నోజ్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని మంచు మ‌నోజ్ తెలంగాణ గాంధీగా అభివ‌ర్ణించాడు. కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టి , తెలుగు భాషా పరి రక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను క‌చ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలి. అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను క‌చ్చితంగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ నిర్ణ‌యం ప‌ట్ల మంచు మ‌నోజ్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. "మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు.


5668

More News

VIRAL NEWS