ఆ పాప‌ని ఐఏఎస్ అధికారిని చేస్తాను: మంచు మ‌నోజ్

Tue,March 19, 2019 12:13 PM
manchu manoj kumar helps to poor girl

మాట‌ల్లో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావభావాలు మోహ‌న్ బాబు సొంతం. విల‌న్‌గా, నటుడిగా విభిన్న పాత్ర‌లు పోషించిన మోహ‌న్ బాబు 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. కెరీర్ మొద‌ట్లోనే దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందిన మోహ‌న్ బాబు అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఆర్ట్ పిక్చర్స్ అనే బేన‌ర్‌ని స్థాపించాడు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న ఈ రోజు 69వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు .ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిన్న కుమారుడు మంచు మ‌నోజ్ ఓ బాలిక‌ని దత్త‌త తీసుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు.

నాన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏదో ఒక మంచి ప‌ని చేయాల‌ని అనుకున్నాను. ఈ క్ర‌మంలో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలిక‌ని ద‌త్త‌త తీసుకున్నాను. విద్యానికేత‌న్ పాఠ‌శాల‌లో చేర్పించాను. ఆమె బాధ్య‌త‌ల‌న్నీ నేనే చూసుకుంటాను. ఐఏఎస్ అధికారి కావాలన్న‌ది బాలిక‌ ఆశ‌యం. ఆమె అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు అండ‌గా ఉంటాను అని మ‌నోజ్ అన్నారు. మ‌నోజ్ ఔదార్యానికి ప‌లువురి నుండి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

2196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles