బిగ్ బాస్ హౌజ్‌లో ప్రత్య‌క్ష‌మైన మంచు ల‌క్ష్మీ

Sun,July 22, 2018 11:51 AM
manchu lakshmi enter into bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 స‌క్సెస్ ఫుల్‌గా సాగిపోతుంది. ఓ వైపు ఇంటి స‌భ్యులు ఆడుతున్న వెరైటీ టాస్క్‌లు, మ‌రో వైపు నాని చేసే హంగామా, మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర యూనిట్ చేసే సంద‌డి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ రోజు మంచు ల‌క్ష్మీ త‌న తాజా చిత్రం వైఫ్ ఆఫ్ రామ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌త్య‌క్షం కానుంది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన వైఫ్ ఆఫ్ రామ్ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై జ‌నాల‌లో మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు బిగ్ బాస్ 2ని ఆశ్ర‌యించింది మంచు ల‌క్ష్మీ. ఇంట్లో హౌజ్‌మేట్స్‌తో క‌లిసి మంచు ల‌క్ష్మీ చేసే సంద‌డి సూప‌ర్ ఫ‌న్‌ని అందించనుంది. తాజాగా నేటి ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో నాని, మంచు ల‌క్ష్మీల మ‌ధ్య జరిగే సంభాష‌ణ‌లు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. నేటి ఎపిసోడ్‌లో సామ్రాట్‌, తేజ‌స్వీల‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో కూడా తెలియ‌నుంది.2778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS