స్పెష‌ల్ డే రోజు స‌ర్‌ప్రైజ్ ఇస్తానంటున్న మంచు హీరో

Sat,December 8, 2018 11:18 AM
Manchu hero to announce his next film very soon

మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. అభిమానుల ప్రశ్న‌ల‌కి ఓపిక‌గా స‌మాధాన‌మిచ్చే మ‌నోజ్ అక్టోబ‌ర్‌లో ఓ లేఖ పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. కొన్నాళ్ళు సినిమాల‌కి బ్రేక్ ఇస్తున్న‌ట్టు లేఖ‌లో పేర్కొన్నాడు . అయితే లేఖ చూసిన వారంతా మ‌నోజ్ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాడా అని చ‌ర్చ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. అంత‌లో తాను ప్ర‌జ‌ల కోసం ఏదో చేయాల‌నుకుంటున్నాన‌ని, దానికి రాజ‌కీయ రంగు పుల‌మోద్ద‌ని కోరాడు.దీంతో అభిమానుల‌లో కొంత క్లారిటీ ఇచ్చింది.

ఇక ఖాళీ ప్ర‌దేశంలో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ .. పేద విద్యార్ధులు, రైతుల కోసం ఏదో చేయాల‌నుకున్న నా క‌ల ఈ ఖాళీ ప్ర‌దేశం ద్వారా తీర‌బోతుంది.ఈ ప్ర‌దేశంలో ఏదో ఒక‌టి ప్రారంభించాలని అనుకుంటున్నాను. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే.. నేనున్నచోట స్పోర్ట్స్, ఫ్రీ ఫుడ్ లేదంటే వాటర్ సదుపాయం పేద ప్రజలకు కల్పించాలనేదే అని ఆ మ‌ధ్య త‌న ట్వీట్‌లో తెలిపాడు . దీంతో సినిమాల‌కి కాస్త దూరంగా ఉంటున్న మ‌నోజ్ సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో నిల‌వాల‌ని భావిస్తున్నాడ‌ని అభిమానులు భావించారు. అయితే ఇటీవ‌ల త‌న అభిమానుల‌ని క‌లిసిన మ‌నోజ్ త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెబుతాన‌ని అన్నాడ‌ట‌. త‌న తండ్రి మంచు మోహ‌న్ బాబు బ‌ర్త్‌డే ( మార్చి 19,2019న‌) తాజా చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఆ రోజే మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌నున్నార‌ట‌.

1985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles