క్యాంప్ ఆఫీసులో కేటీఆర్‌ని క‌లిసిన మల‌యాళ స్టార్ హీరో

Fri,July 20, 2018 12:01 PM
Mammootty meets ktr in camp office

మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ని సీఎం క్యాంప్ ఆఫీసులో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు. జూలై 25న జ‌ర‌గ‌నున్న కైరాలీ పీపుల్ ఇన్నోటెక్ అవార్డ్స్ వేడుక‌కి ముఖ్య అతిధిగా రావాల‌ని కేటీఆర్‌ని కోరారు మ‌మ్ముట్టి. ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక మమ్ముట్టిని శాలువాతో స‌త్క‌రించిన కేటీఆర్ ఓ జ్ఞాపిక‌ని కూడా అందించారు. కేటీఆర్‌ని క‌ల‌వ‌డంపై మ‌మ్ముట్టి ఆనందం వ్య‌క్తం చేశారు . ప్ర‌స్తుతం దివంగ‌త వైఎస్ రాజ‌శేఖర్ రెడ్డి బ‌యోపిక్ యాత్ర చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు మ‌మ్ముట్టి. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. జూన్ 20న చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, ఇటీవ‌ల వైఎస్ఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని యాత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ అంద‌రిని అల‌రించింది. మహి వి రాఘవ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ముఖ్యంగా చూపించనున్నారని స‌మాచారం.


1642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS