షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స్టార్ హీరో

Tue,February 20, 2018 09:41 AM
Mammootty injured in mamangam movie sets

మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం మామంగ‌మ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. సజీవ్ పిళ్ళై ద‌ర్శ‌క‌త్వంలో 50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌మ్ముట్టి నాలుగు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నార‌ని తెలుస్తుండ‌గా, తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌లో మామంగ‌మ్ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేక‌ర్స్‌. అయితే ఈ చిత్రంకి సంబంధించి ఓ ఫైట్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా స్టార్ హీరో మ‌మ్ముట్టి స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకున్న‌ట్టు తెలుస్తుంది. వీలైనంత త్వ‌ర‌లోనే మమ్ముట్టి టీంతో జాయిన్ కానున్నాడ‌ని అంటున్నారు. మామంగ‌మ్ చిత్రంలో ప్రేమ్ న‌జీర్‌, జ‌యాన్‌, జోస్ ప్ర‌కాశ్ మరియు అలుమ్మూడాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక మ‌మ్ముట్టి ఈ చిత్రంతో పాటు ప‌రోల్‌, అంకుల్‌, పెరంబు, అబ్ర‌హ‌మింటే సంత‌తిక‌ల్ ప్రాజెక్టుల‌తోను బిజీగా ఉన్నాడు. కుంజ‌లై మ‌ర‌క్క‌ర్ అనే చారిత్రాత్మ‌క చిత్రం కూడా చేయ‌నున్నాడు మ‌మ్ముట్టి.

2696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles