చై-సామ్ చేతుల మీదుగా మ‌ల్లి రావా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,November 30, 2017 10:11 AM
malli raava trailer released

అక్కినేని కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత త‌న కుటుంబ సభ్యుల‌కి ఫుల్ స‌పోర్ట్ ఇస్తుంది. ఇప్ప‌టికే అఖిల్ మూవీలో సామ్ ఓ గెస్ట్ రోల్ పోషించిందని తెలుస్తుండ‌గా, తాజాగా సుమంత్ మూవీ మ‌ల్లి రావా ట్రైల‌ర్‌ని చైతూతో క‌లిసి విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో సుమంత్ నూత‌న దంప‌తులకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ, కార్తీక్, జెస్సీలు మ‌రో కార్తీ, అంజ‌లిల స్టోరీని ప‌రిచ‌యం చేసార‌ని అన్నాడు. మ‌ల్లి రావా చిత్రం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్క‌గా, ఇందులో బ‌ద్రినాద్ కి దుల్హ‌నియా న‌టి ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌గా న‌టించింది. ఇక అన్న‌పూర్ణ‌, కాదంబరి కిర‌ణ్ కుమార్, మిర్చి కిర‌ణ్‌, అభిన‌వ్, అప్పాజీ అంబ‌నిష త‌దిత‌రులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చాడు. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌లే మెలోడి సాంగ్ విడుద‌ల చేశారు. శ్ర‌వ‌న్‌, సునీత పాడిన ఈ పాట గుండెకు హ‌త్తుకుపోయేలా ఉంది. డిసెంబ‌ర్ 8న విడుద‌ల కానున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే గ్రాండ్ ఆడియో వేడుక జ‌రుపుకోనుంది.



1443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles