మెలోడి సాంగ్‌తో అద‌ర‌గొట్టిన సుమంత్‌

Mon,November 27, 2017 10:22 AM
MALLI RAAVA  title song released

ఈ మ‌ధ్య స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తున్న సుమంత్ ప్ర‌స్తుతం మ‌ల్లి రావా అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న బ‌ద్రినాద్ కి దుల్హ‌నియా న‌టి ఆకాంక్ష సింగ్ న‌టించింది. అన్న‌పూర్ణ‌, కాదంబరి కిర‌ణ్ కుమార్, మిర్చి కిర‌ణ్‌, అభిన‌వ్, అప్పాజీ అంబ‌నిష త‌దిత‌రులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిత్ర క‌థ‌, స్క్రీన్ ప్లే మ‌రియు డైలాగ్స్ గౌత‌మ్ తిన్న‌నూరి అందించ‌గా శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చాడు. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మెలోడి సాంగ్ విడుద‌ల చేశారు. శ్ర‌వ‌న్‌, సునీత పాడిన ఈ పాట గుండెకు హ‌త్తుకుపోయేలా ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి మెలోడి మ‌రొక‌టి రాలేద‌నే చెప్పాలి. సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న టైటిల్‌ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

2313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles