సుమంత్ ఈజ్ బ్యాక్.. టీజ‌ర్ తో హల్ చ‌ల్

Thu,August 3, 2017 12:13 PM
Malli Raava movie Teaser

బాలీవుడ్ మూవీ విక్కీ డోనార్ రీమేక్ గా న‌రుడా డోన‌రుడా అనే చిత్రంతో సుమంత్ఇటీవ‌ల‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోగా ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. మ‌ల్లి రావా అనే టైటిల్ తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న బ‌ద్రినాద్ కి దుల్హ‌నియా న‌టి ఆకాంక్ష సింగ్ న‌టించింది. అన్న‌పూర్ణ‌, కాదంబరి కిర‌ణ్ కుమార్, మిర్చి కిర‌ణ్‌, అభిన‌వ్, అప్పాజీ అంబ‌నిష త‌దిత‌రులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిత్ర క‌థ‌, స్క్రీన్ ప్లే మ‌రియు డైలాగ్స్ గౌత‌మ్ తిన్న‌నూరి అందించ‌గా శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చాడు. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ మూవీపై భారీగానే ఎక్స్ పెక్టేష‌న్ పెంచింది. ఆ టీజ‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.

1638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles