మలయాళ బ్యూటీ సాయి పల్లవి తెలుగు, తమిళం, మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెకి అన్ని భాషలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల పడిపడి లేచే మనసు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ చిత్రం పెద్దగా అభిమానులని అలరించకపోయిన, సాయి పల్లవి నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మారి అనే తమిళ చిత్రంతోను ఇటీవల ప్రేక్షకల ముందుకు వచ్చింది సాయి పల్లవి. ఇందులోను అదరగొట్టింది. అయితే సాయి పల్లవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె నటించిన మలయాళ చిత్రం అతిరన్ని తెలుగులో, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రాన్ని వివేక్ తెరకెక్కించగా ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణ సంస్థ సెంచరీ ఫిలిమ్స్ అతిరన్ చిత్రాన్ని మూడు భాషలలో ఏప్రిల్లో విడుదల చేయాలని భావిస్తుందట .