ద‌ర్భార్ చిత్రంలో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు

Thu,May 9, 2019 12:44 PM
Malayalam actor Chemban Vinod Jose to lock horns with Rajinikanth

ర‌జనీకాంత్ ద‌ర్బార్‌లోకి ప్ర‌ముఖుల ఎంట్రీ కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌ల ఈ మూవీ సెట్స్‌లోకి బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ అడుగు పెట్టిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ టీంతో జాయిన్ అయిన‌ట్టు స‌మాచారం. గోలి సోడా 2 చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చెంబ‌న్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషించాడు. గోలిసోడా 2 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోయిన‌ప్పటికి, చెంబ‌న్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న‌ ద‌ర్భార్‌లో చెంబ‌న్‌ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాతో ఆయ‌న‌కి త‌మిళంలోను మంచి ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దర్బార్. ఇటీవ‌లే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ముంబైలో చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్‌లో న‌య‌న‌తార కూడా జాయిన్ అయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది. రజనీకాంత్ ‘దళపతి’ సినిమాకు పనిచేసిన సంతోష్ శివన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘దర్బార్’ కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

1489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles