నేల ‘టిక్కెట్టు’ అమ్మిన హీరోయిన్

Fri,May 25, 2018 06:04 PM
malavika sharma sells tickets today


రవితేజ, మాళవిక శర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘నేలటిక్కెట్టు’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ మాళవిక శర్మ నగరంలో సందడి చేసింది. చిత్ర యూనిట్ కొత్తగా మాళవిక శర్మతో కొంతమంది ఆడియెన్స్‌కు టికెట్స్ అమ్మించాలని ప్లాన్ చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు మాళవిక టిక్కెట్లు అమ్ముతున్న సంధ్య థియేటర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రవితేజ ఫ్యాన్స్, మాళవిక శర్మను చూసేందుకు వచ్చిన వారితో సంధ్య థియేటర్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

4887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles