HomeLATEST NEWSMalavika Sharma injured in accident

ర‌వితేజ‌కి కాదు, చిత్ర‌ హీరోయిన్‌కి గాయాలు..!

Published: Wed,February 28, 2018 08:23 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నేల టికెట్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ర‌వితేజ గాయ‌ప‌డ్డాడ‌ని రీసెంట్‌గా ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై దర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ ..ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. షూటింగు సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదనీ .. ఎప్పటిలానే షూటింగులో రవితేజ చురుకుగా పాల్గొంటున్నాడని తెలిపాడు . అయితే క‌ళ్యాణ్ ట్వీట్ చేసిన కొద్ది గంట‌ల‌కి చిత్ర హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమెకి కొంత విశ్రాంతి కావాల‌ని డాక్ట‌ర్స్ సూచించార‌ట‌. దీంతో సినిమా షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతుంది. స‌మ్మ‌ర్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. నాని-నాగార్జున హీరోలుగా వస్తోన్న మల్టీస్టారర్‌లోను మాళవిక నటిస్తున్నారు. ఇందులో ఆమె నానికి జోడీగా కనిపించనున్నారు.
3683
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology