మాళవికాకి మరో ఛాన్స్ .. విజయ్ కి జోడీగా కేరళ కుట్టి

Thu,August 17, 2017 03:51 PM
malavika pair with vijay devarakonda

కళ్లు ఎన్నో ఎక్స్ ప్రెషెన్స్ ఇస్తాయి. మాటల్లో చెప్పలేని మనసు చెప్పే భావాల్ని కళ్లు పలికిస్తాయి. మాట్లాడతాయి. కళ్లు భావాల లోగిళ్లు. మధురానుభూతుల్ని కలిగించే భావాల్ని పలికించే కళ్లు అందరికీ ఉండవు. నిజం చెప్పాలంటే అవి కొందరికే సొంతం. అలా అందమైన కళ్లున్న భామ మాళివికా నాయర్. తెలుగులో మాళవిక చేసింది కొద్ది సినిమాలే అయినా కంటి చూపుతో మనసు దోచుకుంది ఈ కుట్టి. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసింది.

నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది మాళ‌వికా నాయ‌ర్. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ అమ్మాయి మంచి మార్కులు కొట్టేసింది. కళ్లతో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషెన్సే అందుకు కారణం. ఇక ఆ త‌ర్వాత చేసిన 'కళ్యాణ వైభోగమే' సినిమా కూడా తనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక చాలా గ్యాప్ త‌ర్వాత రాహుల్ సాంకృత్యాయ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మాళ‌వికా ఓ చిత్రం చేస్తుంది. ఈ మూవీ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ కాగా, ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ క్యాబ్ డ్రైవ‌ర్ గా క‌నిపిస్తాడ‌ట‌. మ‌రి ఈ చిత్రం అమ్మ‌డి కెరియ‌ర్ కి ఎంత ప్లస్ అవుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

2196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles