ఇంటర్ పరీక్షల వల్ల ప్రమోషన్‌కు దూరంగా హీరోయిన్

Wed,March 2, 2016 10:38 AM
malavika not attended for promotion

నందిని రెడ్డీ దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో కళ్యాణ వైభోగమే అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేస్తుండగా ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచింది చిత్ర యూనిట్ . ఈ చిత్ర విడుదల తేదీన పలు సినిమాలు పోటి పడుతుండగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్‌లతో ప్రమోషన్స్‌ని హోరెత్తిస్తున్నారు. అయితే ఇక్కడ అభిమానులందరిని ఒక విషయం ఆశ్యర్యపరిచింది. అదేమంటే చిత్ర హీరో , దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరు ప్రమోషన్స్‌కు హాజరవుతున్న, హీరోయిన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో గాసిప్ రాయుళ్ళు పుకార్లకు పని చెప్పారు.

కేరళ కుట్టి మాళవిక కళ్యాణ వైభోగమే చిత్రంలో హీరోయిన్‌గా నటించగా ప్రస్తుతం ఈ అమ్మడు ఇంటర్ ఎగ్జామ్స్ సీబీఎస్ సిలబస్‌లో రాస్తుందట. దాంతోనే ప్రమోషన్‌కి హాజరు కావడం లేదని నాగశౌర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాళవిక లేని లోటును దాదాపు చిత్ర యూనిట్ అంతా కలిసి భర్తీ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉండగా, చాలా గ్యాప్ తర్వాత రాశి ఈ చిత్రంలో మెరవనుంది. మాళవిక తల్లి పాత్రను రాశి చేయనుండగా, నాగ శౌర్యకు మమ్మీగా ఐశ్వర్య నటించారు. ఇక నాగశౌర్య హీరోగా నటించిన ఒక మనసు చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా, ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

3918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles