మ‌లైకా బ‌ర్త్‌డే పార్టీలో సంద‌డి చేసిన బాలీవుడ్ స్టార్స్

Wed,October 23, 2019 01:40 PM

అర్జున్ క‌పూర్‌తో ప్రేమ‌యాణం విష‌యంలో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది మ‌లైకా అరోరా. నిన్న మ‌లైకా బ‌ర్త్‌డే కావడంతో ఆమె ముంబైలో త‌న బ‌ర్త్‌డే పార్టీని ఘ‌నంగా జ‌రుపుకుంది. 46వ వసంతంలోకి అడుగిడిన మ‌లైకా త‌న బాయ్ ఫ్రెండ్ అర్జున్ క‌పూర్, స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే, శ్వేత బ‌చ్చ‌న్ నందా వంటి బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌తో క‌లిసి బ‌ర్త్‌డేని ఘ‌నంగా జ‌రుపుకుంది. సిల్వ‌ర్ ఔట్ ఫిట్స్‌లో మ‌లైకా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అంతేకాదు అర్జున్ క‌పూర్‌తో క‌లిసి స్టెప్పులేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


మలైకా అరోరా 1998లో అర్భాజ్ ఖాన్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ళ కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ళుగా వీరి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన 2016 నవంబర్ లో కోర్టు మెట్లెక్కారు. కౌన్సిలింగ్ తో వారి నిర్ణయాన్ని మార్చుదామని కోర్టు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మే 17,2017న‌ బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి వివాహ బంధానికి శాశ్వతంగా బ్రేక్ వేసింది. కుమారుడి సంరక్షణ బాధ్యతలను మలైకా కి అప్పగించగా, బాబుతో సరదాగా గడిపే సమయం వెచ్చించేందుకు అర్బాజ్ కి కోర్టు అనుమతినిచ్చింది. అయితే అర్బాజ్, మలైకాకి గొడవ రావడానికి కారణం బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అని అప్ప‌ట్లో పుకార్లు షికారు చేశాయి. మ‌లైకా ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్‌తో డేటింగ్‌లో ఉంది.







1891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles