మరోసారి ప్రత్యేక గీతంలో మలైకా అరోరా

Mon,August 20, 2018 03:41 PM
Malaika arora to shake leg in another special song

ముంబై: పవన్‌కల్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్‌లో ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ భామ మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పటాఖా. సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా, రాధికామదన్ ప్రధాన పాత్రల్లో నటిస్త్తున్నారు. ఈ చిత్రంలో ‘హలో హలో’ అంటూ వచ్చే ప్రత్యేక గీతంలో మలైకా చిందులు వేయనుంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య నేతృత్వంలో ఇప్పటికే పాట కోసం శిక్షణ కూడా తీసుకుంది మలైకా. పటాఖాలో హలో హలో ప్రత్యేక గీతాన్ని ఈ వారం షూట్ చేయనున్నట్లు నిర్మాత అజయ్‌కపూర్ తెలిపాడు.

2300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles