రణ్‌బీర్.. మున్నాభాయ్‌గా ఎలా మారాడు.. మేకింగ్ వీడియో

Wed,July 11, 2018 02:41 PM
Making video shows how Ranbir Kapoor has become Munnabhai in the film Sanju

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. పది రోజుల్లోనూ రూ.300 కోట్ల క్లబ్‌కు చేరువగా వచ్చేసిందీ మూవీ. స్క్రీన్‌పై అచ్చూ సంజయ్‌దత్‌లాగే కనిపిస్తున్న రణ్‌బీర్‌ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీ అంతా ఒకెత్తయితే.. ఇందులో రణ్‌బీర్.. మున్నాభాయ్ క్యారెక్టర్‌లో జీవించిన తీరు మూవీకే హైలైట్‌గా చెప్పొచ్చు. సంజయ్‌దత్ సెకండ్ ఇన్నింగ్స్ మున్నాభాయ్ ఎంబీబీఎస్‌తోనే ఘనంగా మొదలైంది. దీంతో సంజూలో ఈ మూవీ సీన్‌ను ప్రత్యేకంగా చిత్రీకరించారు. దీనికోసం రణ్‌బీర్ పూర్తిగా మున్నాభాయ్‌లాగా మారిపోయాడు. అతని లుక్, మేనరిజం అచ్చూ ఆ క్యారెక్టర్‌లో సంజయ్‌దత్ ఎలా ఉన్నాడో అలాగే అనిపించింది. అయితే దీనికోసం మూవీ యూనిట్ బాగానే కష్టపడింది. అతనికి ఆ లుక్ తీసుకురావడానికి మేకప్ టీమ్ పడిన కష్టం.. మున్నాభాయ్‌లా మెప్పించడానికి రణ్‌బీర్ పడిన శ్రమ చాలానే ఉంది. ఈ సీన్ మేకింగ్ వీడియోలో మూవీ యూనిట్ ఆ కష్టాన్నంతా చూపించింది.

1263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS