రణ్‌వీర్ ఖలీబలీ సాంగ్ మేకింగ్ వీడియో అదుర్స్

Sun,February 18, 2018 03:25 PM
Making video of Padmaavat Khalibali song is going viral

ఎన్నో వివాదాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నది పద్మావత్. సంజయ్ లీలా భన్సాలీ మార్క్ మూవీగా ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా ఈ సినిమా అల్లావుద్దీన్ ఖిల్జీగా చేసిన రణ్‌వీర్‌సింగ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమాను ఒంటిచేత్తో నడిపాడని అతన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇక ఈ మూవీలో ఖలీబలీ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అయితే అద్భుతం. రణ్‌వీర్ ఇందులో జీవించేశాడు. ఇప్పుడా సాంగ్ మేకింగ్ వీడియో సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. భన్సాలీయే కంపోజ్ చేసిన ఈ పాటకు గణేష్ ఆచార్య అదిరిపోయే కొరియాగ్రఫీ అందించారు. ఇప్పుడీ మేకింగ్ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.


1659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles