మ‌ధుర‌వాణి పాత్రలో స‌మంత‌..మేకింగ్ వీడియో

Wed,May 23, 2018 01:57 PM
Making Video of Madhuravanifrom mahanati

ఏ పాత్ర‌లో అయిన ఇట్టే ఇమిడిపోయే న‌టీమ‌ణుల‌లో స‌మంత ఒక‌రు. రంగ‌స్థలంకి ముందు కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించిన స‌మంత ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం చిత్రంలో రామ‌ల‌క్ష్మి పాత్ర పోషించింది. ఈ పాత్ర‌కి నూటికి నూరు మార్కులు ప‌డ్డాయి. అచ్చం ప‌ల్లెటూరి అమ్మాయిగా స‌మంత అభిన‌యం అంద‌రిని ఆకట్టుకుంటంది. ఈ మూవీ త‌ర్వాత స‌మంత న‌టించిన మ‌హాన‌టి రీసెంట్‌గా విడుద‌లైంది. ఇందులో మ‌ధుర‌వాణి అనే జ‌ర్నలిస్ట్ పాత్ర పోషించింది సామ్. ఈ పాత్ర కోసం సామ్ త‌న లుక్‌ని పూర్తిగా మార్చుకోవ‌డ‌మే కాకుండా న‌ట‌న‌లోను వైవిధ్యం చూపించింది . దీంతో స‌మంత పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు ప్రేక్షకాభిమానులు. మ‌హాన‌టి చిత్రం మంచి విజ‌యం సాధించి భారీ వ‌సూళ్ళ‌తో దూసుకెళుతుంది. ఈ చిత్రంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు మేక‌ర్స్ మూవీకి సంబంధించిన మేకింగ్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా మ‌ధుర‌వాణి పాత్ర‌కి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో స‌మంత లుక్ టెస్ట్‌తో పాటు షూటింగ్ టైంలో జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూపించారు. ఈ చిత్రం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, సావిత్రి జీవిత నేప‌థ్యంలో చిత్రాన్ని రూపొందించారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించ‌గా, విజ‌య్ ఆంటోని పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించారు.

3786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles