'యాత్ర'లో జ‌గ‌ప‌తి బాబు.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu,January 3, 2019 01:01 PM

ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు లెజెండ్ సినిమాతో విల‌న్‌గా టర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో జ‌గ‌ప‌తి బాబు త‌న‌ సెకండ్ ఇన్నింగ్స్‌ని మొద‌లు పెట్టాడు. కేవ‌లం విల‌న్ పాత్ర‌లోనే కాక స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ అన్నీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో న‌టిస్తున్నాడు జగ్గూభాయ్. అయితే ఈ విల‌క్ష‌ణ న‌టుడు వైఎస్ఆర్ జీవిత నేప‌థ్యంలో మ‌హీ వి రాఘ‌వ తెర‌కెక్కిస్తున్న యాత్ర సినిమాలో న‌టిస్తున్నాడు. వైఎస్ఆర్ తండ్రి యెడుగూరి సందింటి రాజా రెడ్డి పాత్ర‌ని జ‌గ‌ప‌తి బాబు చేస్తుండ‌గా, ఆయ‌న ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. ఇందులో జ‌గ‌ప‌తి బాబు లుక్ అదిరిపోయింద‌ని అంటున్నారు. లెజండ‌రీ న‌టుడు మ‌మ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

4911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles