హైద‌రాబాద్‌లో జ‌య‌ల‌లిత బయోపిక్ మేజ‌ర్ షెడ్యూల్

Thu,January 10, 2019 01:35 PM
Major Schedule Of Jayalalitha Biopic To Be Shot In Hyderabad

1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల న‌టి జ‌య‌లలిత. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది పురుచ్చతలైవీ. భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమెపై బ‌యోపిక్ రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఏ.ఎల్‌. విజ‌య్‌, ప్రియ‌ద‌ర్శిని, భార‌తీ రాజా, వైబ్రీ మీడియా,ఆదిత్య భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు కొన్నాళ్ళుగా జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ స్క్రిప్ట్‌ని రూపొందించే ప‌నిలో ఉన్నారు. అయితే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ముందుగా తాను ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బ‌యోపిక్ రూపొందిస్తుంది. నిత్యామీన‌న్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఆమె అచ్చం జ‌య‌ల‌లిత లుక్‌లో క‌నిపిస్తుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుంది. జ‌న‌వ‌రి 24 నుండి హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్ర మేజ‌ర్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. చిత్రంలో జ‌య‌ల‌లిత సినీ, పొలిటిక‌ల్ జ‌ర్నీని ప్రియ‌ద‌ర్శిని ఏ విధంగా చూపిస్తుందో అనే దానిపై అంతటా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

1484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles