ఆరు గంట‌ల‌లోపే మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టిన మ‌జ్ను టీజ‌ర్‌

Thu,January 3, 2019 07:59 AM
majnu teaser released

అక్కినేని అఖిల్ న‌టించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఆయ‌న తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను అయిన హిట్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి ఈ మూవీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా, జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ క్ర‌మంలో చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. కేవలం 56 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లోని సన్నివేశాలు యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అఖిల్ ఫైట్స్‌, డ్యాన్స్‌ల‌తో అల‌రించాడు. ఈ టీజ‌ర్‌కి ఆరు గంట‌ల లోపే మిలియ‌న్‌కి పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఈ మూవీ అఖిల్‌కి మంచి విజ‌యం అందిస్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. . చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. థమన్ సంగీతం అందించారు.

1519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles