చెర్రీతో పోటీ ప‌డ‌నున్న అఖిల్‌

Wed,November 7, 2018 11:53 AM
majnu release for sankranthi

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ ప్రస్తుతం తన మూడో చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మూడో సినిమాని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాడు. తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతుంది. మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అభిమానుల‌ని అల‌రించేలా ఉంటుంద‌ని అంటున్నారు. దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అఖిల్ కొత్తగా క‌నిపిస్తున్నాడు. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల అవుతుంద‌నే విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఇప్ప‌టికే చెర్రీ త‌న సినిమా సంక్రాంతికి రానుంద‌ని తెలియ‌జేయ‌గా, ఇప్పుడు అఖిల్ కూడా సంక్రాంతి బ‌రిలోకి దిగ‌డం గ‌మ‌న‌ర్హం. మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండ‌గా, ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. వెంకీ అట్లారీ దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో ఇప్పుడు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా మంచి విజయం సాదిస్తుందని టీం భావిస్తుంది.

3926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS