రిలీజ్ డేట్ లాక్ చేసిన నాని

Fri,September 9, 2016 08:13 AM
majnu release date fixed

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. గోపిసుందర్‌ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నాని కెరీర్‌లో ‘మజ్ను’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాని సరసన ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ కథానాయికలుగా నటించగా వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles