ఫన్నీ మేకింగ్ వీడియో

Tue,September 20, 2016 08:05 AM
Majnu movie making video

నాని,ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ ప్రధాన పాత్రలుగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై ‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్ విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘మజ్ను’. వెరైటీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న గ్రాండ్ గా విడుదల కానుండగా నాని ఈ చిత్రంతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని విశ్లేషకుల అంచనా. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా, ముఖ్య పాత్రలు పోషించగా భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ క్యామియో రోల్ పోషించాడని టాక్ నడుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ‘మజ్ను’ యూనిట్ వినూత్న ప్రచారాలు చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫన్నీ మేకింగ్ వీడియోని విడుదల చేసింది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles