నాని ‘మజ్ను’ ఆడియో రిలీజ్ డేట్ వచ్చేసింది

Tue,August 30, 2016 12:13 PM
MAJNU audio release date fixed

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ‘కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..’ అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, ‘ఓయ్‌.. మేఘమాల..’ అంటూ సాగే రెండో పాటను రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రిలీజ్‌ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ఆడియో వేడుకను ఆగస్ట్ 26న జరపాలని అనుకున్నా కొన్ని కారణాల వలన వాయిదా వేశారు.

తాజాగా సెప్టెంబర్‌ 4న లహరి మ్యూజిక్‌ ద్వారా ‘మజ్ను’ ఆడియో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని సరసన ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ లు నటిస్తోండగా చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

1777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles