వైజాగ్‌లో చైతూ- సామ్ 'మ‌జిలి'

Thu,November 15, 2018 12:08 PM

ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో నాలుగో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈ మూవీకి మ‌జిలి అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తుండ‌గా, ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నేటి నుండి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు మ‌రో షెడ్యూల్ వైజాగ్‌లో జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. శైలజా రెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి చిత్రాలు నాగ చైత‌న్య అభిమానులని నిరాశ‌ప‌ర‌చ‌గా, ఈ చిత్రం వారికి ప‌సందైన వినోదాన్ని అందిస్తుంద‌ని టీం భావిస్తుంది.

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles