స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం: టీజర్

Thu,February 14, 2019 09:25 AM
MAJILI Movie Teaser released

వివాహబంధంతో ఒక్కటైన తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో నీకో సంవ‌త్స‌రం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం అని రావు ర‌మేష్ చెప్పే డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. చిత్రంలో ప‌లు స‌న్నివేశాలు కూడా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ . వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది . నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయ‌నున్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles