మజిలీ నుండి డిలీటెడ్ సీన్

Fri,April 19, 2019 08:43 AM
Majili Movie Deleted Scene 1 released

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాన్ష కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం మ‌జిలీ . ఎమోష‌న‌ల్ ల‌వ్ జ‌ర్నీగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఏప్రిల్ 5న విడుద‌లైన ఈ మూవీ మూడో వారంలోను మంచి వ‌సూళ్ళ‌తో దూసుకెళుతుంది. అయితే చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు డిలీటెడ్ సీన్స్‌ని విడుద‌ల చేస్తుంది చిత్ర బృందం. రీసెంట్‌గా నాగ చైత‌న్య‌, సుబ్బరాజుకి మ‌ధ్య సాగిన ఎమోష‌న‌ల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో నాగ చైత‌న్య‌ని పొడ‌వాల‌ని నెయిల్ క‌ట్ట‌ర్‌తో సుబ్బ‌రాజు రెడీగా ఉంటారు. కాని చైతూ ఇచ్చిన హ‌గ్‌కి సుబ్బ‌రాజులో మార్పు వ‌స్తుంది. ఈ సీన్ చాలా సినిమాటిక్‌గా ఉంద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. మ‌రి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

1356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles