వైర‌ల్‌గా మారిన మ‌జిలి లొకేష‌న్ పిక్స్

Wed,November 21, 2018 08:36 AM
majili location pics goes viral

పెళ్ళి త‌ర్వాత తొలిసారి నాగ చైత‌న్య‌, స‌మంత క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మ‌జిలి అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుత‌న్న‌ నాలుగో చిత్రం మ‌జిలి. ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఓ షెడ్యూల్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం వైజాగ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. సింహాచ‌లం ప‌రిస‌ర ప్రాంతాల‌లో కీల‌క స‌న్నివేశాలు తెరకెక్కిస్తుండ‌గా, లొకేష‌న్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

చిత్రంలో సామ్‌, చైతూలు భార్య భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. భారీ గ‌డ్డంతో చైతూ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. చైతూ మాజీ క్రికెట‌ర్‌గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. నటుడు సుబ్బరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

1633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles