ఫుట్ బోర్డుపై సమంత, చైతూ..మజిలీ లుక్

Tue,February 12, 2019 10:05 PM
Majili latest poster goes Viral

పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఫిదా చేసింది. తాజాగా మజిలీకి సంబంధించిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైతూ, సమంత బస్సు ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తుండగా..సమంతను చైతూ ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. లవ్ అండ్ పెయిన్ తో మ్యాజికల్ జర్నీని కొనసాగించేందుకు సిద్దమవండి అంటూ శివనిర్వాణ చేసిన ట్వీట్ తో ఉన్న ఫొటో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న 9:09 నిమిషాలకు మజిలీ టీజర్ విడుదల కానుంది.

2376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles