చైతూ-సామ్‌ల 'మ‌జిలీ'.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sun,December 30, 2018 10:23 AM
majili first look released

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత పెళ్ళి త‌ర్వాత తొలిసారి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మ‌జిలి అనే టైటిల్‌తో కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. అయితే తాజాగా చిత్రానికి అదే టైటిల్ ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. చై, సామ్‌ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం’ అని చైతూ పేర్కొంటూ లుక్‌ను షేర్‌ చేశారు. ఫ‌స్ట్ లుక్‌లో చై, సామ్‌ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటున్న‌ట్టు ఉండ‌గా , బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది.

ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ నాలుగో చిత్రం మ‌జిలి. ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. చిత్రంలో సామ్‌, చైతూలు భార్య భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. చైతూ మాజీ క్రికెట‌ర్‌గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. నటుడు సుబ్బరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


1641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles