రణ్‌బీర్‌తో సిగ‌రెట్ తాగ‌డంపై నోరు విప్పిన పాక్ బ్యూటీ !

Wed,October 18, 2017 01:38 PM
MAHIRA KHAN open up on viral photo issue

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ న్యూయార్క్‌లో సిగరెట్ తాగుతూ ఉన్న కొన్ని ఫోటోలు ఇటీవ‌ల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నెటిజన్స్ ఈ ఫోటోలకి విచిత్ర‌ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మహీరాని టార్గెట్ చేసి దూష‌ణ‌కి దిగారు. నువ్వు ముస్లిం అయి ఉండి సిగరెట్ ఎలా తాగుతావు, ఓపెన్ డ్రెస్ ఎలా ధరిస్తావు అంటూ ఆమెపై విమర్శలు కురిపించారు. కొందరు రణ్‌బీర్, మహీరా డేటింగ్‌లో ఉన్నట్టు ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు వారికి సపోర్టింగ్‌గా నిలిచారు కూడా. అయితే ఇటు ర‌ణ్‌బీర్ కాని, అటు మ‌హీరా ఖాని దీనిపై మొన్న‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. వెర్నా ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కి హాజ‌రైన మ‌హీరా తొలి సారి ఈ వివాదంపై స్పందించింది. ఇది నా ప‌ర్స‌న‌ల్ మేట‌ర్‌. ఈ రోజుల్లో ఒక‌ అబ్బాయి, అమ్మాయి క‌లిసి తిర‌గ‌డం చాలా సాధార‌ణం. అయిన‌ప్ప‌టికీ ఈ సంఘ‌ట‌న ద్వారా చాలా మంచి గుణ‌పాఠం నేర్చుకున్నా! మీడియా ప్ర‌తి చోట ఉంటుంద‌ని, వాళ్ల‌ క‌ళ్లుగ‌ప్పి తిర‌గ‌డం క‌ష్ట‌మ‌ని నాకు అర్థ‌మైంది` అని మ‌హీరా ఖాన్ అంది.

2380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS