వైఎస్ఆర్ బ‌యోపిక్‌పై వ‌చ్చిన స్మాల్ క్లారిటీ..!

Wed,March 21, 2018 12:42 PM
mahi with mammootty, project confirmed

కొద్ది రోజులుగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌పై ప‌లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో రాజ‌శేఖర్ రెడ్డిగా నాగార్జున న‌టించ‌నున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అంత‌క‌ముందు మ‌మ్ముట్టిని ఎంపిక చేసార‌ని చెప్పుకొచ్చారు. కాని దీనిపై క్లారిటీ లేదు. అయితే చిత్ర ద‌ర్శ‌కుడు మహి రాఘ‌వ త‌న ట్విట్ట‌ర్‌లో మ‌మ్ముట్టితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ మిమ్మ‌ల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు మా సినిమాకి చేయ‌డం గొప్ప అదృష్టం అని అన్నారు. దీంతో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టించ‌నున్నాడ‌ని అభిమానులు క‌న్‌ఫాం అయిపోయారు. ఈ సినిమా కోసం మ‌మ్ముట్టి త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటార‌ట‌. మే నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, యాత్ర అనే టైటిల్‌తో ఈ మూవీ తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్స్ పూర్తి చేసిన మ‌హి ప్ర‌స్తుతం న‌టీన‌టుల‌ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై విజ‌య్ చిల్లా మ‌రియు శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంద‌ట‌. మేలో మొదలైన చిత్ర షూటింగ్ సెప్టెంబర్ వ‌ర‌కు పూర్తి కానుంద‌ట‌. చిత్రంలో ఫీమేల్ లీడ్‌తో పాటు జ‌గ‌న్ పాత్ర కోసం ఇంకెవ‌రిని అప్రోచ్ కాలేద‌ని మ‌హి తెలిపారు.

1818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS