మ‌మ్ముట్టితో మా 'యాత్ర' ముగిసింది

Thu,November 1, 2018 09:01 AM

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బ‌యోపిక్ సీజ‌న్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి జీవిత నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ యాత్ర పేరుతో బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు. విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ఆర్‌గా మ‌మ్ముట్టి క‌నిపించ‌నున్నాడు. తాజాగా ఆయ‌న‌కి సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ముగిసింది. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా మ‌మ్ముట్టితో ఇన్ని రోజుల ప్ర‌యాణంలో ఏర్ప‌డిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.


390కి పైగా సినిమాలు, 3 నేషనల్‌ అవార్డులు, 60మందికి పైగా నూతన దర్శకులను పరిచయం చేసిన వ్యక్తి మమ్ముట్టిగారు. అవ‌న్నీ కాకుండా అత‌నొక గురువు, మంచి వ్యక్తిత్వం ఉన్న మ‌నిషి. అత‌ను ఇంకా నిరూపించుకోవ‌ల‌సింది ఏమి లేదు. అత‌ను ఎప్ప‌టికి ఓ లెజెండ్‌. మ‌న సంప్ర‌దాయం ప్ర‌కారం అతిధిని గౌర‌వించ‌డం చేస్తుంటాం. ఏదైనా సినిమాలో తన పాత్రను సరిగ్గా నిర్వర్తించకపోయినా, మీ అంచనాలను అందుకోకపోయినా ప్రేక్షకులుగా మీరు ఆయన్ను విమర్శించవచ్చు. కానీ, నటుడిగా ఆయనకున్న డెడికేషన్‌ అభినందించకుండా ఉండలేనిది.

ఈ స్క్రిప్ట్‌ని మ‌మ్ముట్టి తెలుగులోనే విన్నారు. ప్రతి అక్షరానికీ అర్థం తెలుసుకున్నారు. ప్ర‌తి డైలాగ్‌ని ఆయ‌న‌కి అనుగుణంగా రాసుకొని సెట్‌లో క్షుణ్ణంగా ప‌లికారు. డ‌బ్బింగ్ స‌మ‌యంలో కూడా ఒక‌టి రెండు సార్లు ప‌రిశీలించుకున్నారు. మ‌న భాష‌, సంప్ర‌దాయం, సినిమాలు త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న‌కి గౌర‌వం ఏర్ప‌డ్డాయి. నా మ‌న‌స్పూర్తిగా చెబుతున్నాను ఈ క్యారెక్ట‌ర్‌కి మమ్ముట్టిగారు త‌ప్ప మ‌రెవ‌రు న్యాయం చేయ‌లేరు. అత‌నిలో మ్యాజిక్ ఉంది. వండ‌ర్‌ఫుల్ ప‌ర్స‌న్‌. యాత్ర‌లో భాగం అయినందుకు గొప్ప‌గా ఉంది అని పోస్ట్‌లో తెలిపారు మ‌హి వి రాఘ‌వ‌. ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

2449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles