మరోసారి కోటీశ్వరుడిగా మహేశ్..?

Tue,December 18, 2018 10:42 PM
Maheshbabu to turn as sreemanthudu again for maharshi ?

హైదరాబాద్‌: టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. మహేశ్ సంపన్న కుటుంబానికి వారసుడిగా కనిపించిన విషయం తెలిసిందే. మహేశ్ తాజాగా మరోసారి రిచ్ లుక్ లో కనిపిస్తాడని ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతున్నది. కొత్త చిత్రం మహర్షిలో మహేశ్ ఐదుగురు కోటీశ్వరుల్లో ఒకడిగా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ చిత్రంగా మహర్షి తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోండగా..అల్లరి నరేష్‌, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.‌

3571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles