‘సర్కార్‌’ ను చాలా ఎంజాయ్‌ చేశా: మహేశ్

Thu,November 8, 2018 10:08 PM
maheshbabu praises to sircar movie unit

ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్‌’ సినిమాపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించాడు. సర్కార్ లో మురుగదాస్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించిందని ట్వీట్ చేశాడు మహేశ్. సర్కార్..అద్భుతమైన పొలిటికల్‌ డ్రామా చిత్రం. ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశా. సినిమాలో మురుగదాస్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించింది. చిత్రయూనిట్ నా శుభాకాంక్షలు’ అని మహేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. మహేశ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో ‘స్పైడర్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

‘సర్కార్‌’ చిత్రంలో విజయ్ సరసన కీర్తిసురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. మంగళవారం విడుదలైన ఈ చిత్రం తనదైన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది.
2279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles