వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్న మహేష్ మూవీ!

Tue,September 19, 2017 04:57 PM
వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్న మహేష్ మూవీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అను నేను చిత్రంతో బిజీగా ఉన్నాడు మహేష్ . ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాని ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన అసెంబ్లీ సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుండగా, తర్వాతి షెడ్యూల్‌ని లండన్‌లోని హిస్టారిక్ ప్లేస్‌లలో చిత్రీకరించాలని టీం భావించారట. కాని పర్మీషన్ దొరక్కపోవడంతో మూవీ టీం డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేయడం కష్టంగా భావిస్తుంది. ఈ క్రమంలో మూవీ రిలీజ్‌ని సంక్రాంతి నుండి సమ్మర్‌కి షిప్ట్ చేసినట్టు సమాచారం. భరత్ అను నేను చిత్రం డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై నిర్మితమవుతుండగా, ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నట్టు టాక్. కైరా అద్వానీ కథానాయికగా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

1038

More News

VIRAL NEWS