ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో సంద‌డి చేయ‌నున్న మ‌హేష్‌

Tue,May 14, 2019 11:11 AM
mahesh will be visiting  Sudarshan 35MM at RTC X Roads tomorrow

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్‌గా మ‌హర్షి చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి చిత్రం కేవ‌లం నాలుగు రోజుల‌లోనే వంద కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి అందరికి షాక్ ఇచ్చింది. త‌న సినిమాని జ‌నాల‌లోకి మ‌రింత‌గా తీసుకెళ్ళేందుకు మ‌హేష్ బాబు చాలా కృషి చేస్తున్నాడు. ప‌లు ఈవెంట్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్న‌ మ‌హేష్ రేపు సాయంత్రం 6 గంట‌ల‌కి ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ లోని సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్‌లో జ‌ర‌గ‌నున్న స‌క్సెస్ సెల‌బ్రేష‌న్‌లో పాల్గొన‌నున్నాడు. ఇందుకు థియేట‌ర్ యాజ‌మాన్యం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మ‌హేష్ న‌టించిన మురారీ, ఒక్క‌డు, అత‌డు, పోకిరీ, దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి మెమొర‌బుల్ చిత్రాలు సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డి ఘ‌న విజ‌యం సాధించాయి. ఇప్పుడు మ‌హ‌ర్షి కూడా ఈ థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. మ‌హ‌ర్షి చిత్రాన్ని ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా చిత్ర బృందం అభివ‌ర్ణిస్తుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి చిత్రంలో మ‌హేష్ బాబు, అల్లరి న‌రేష్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.


2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles