ఏఎంబీ సినిమాస్‌లో మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం

Fri,February 22, 2019 09:32 AM
mahesh will be launching his first ever wax figure

సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేష్‌ మైనపు విగ్రహాన్నిఉంచ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అంత‌క‌ముందు మహేష్‌కు చెందిన ఏఎంబీ థియేటర్‌లో ఈ విగ్రహాన్నిఉంచ‌నున్నారు. మార్చి 25న వ్యాక్స్ విగ్ర‌హాన్ని మ‌హేష్ లాంచ్ చేయ‌నున్నారు. ఒక్క రోజు మాత్ర‌మే ఈ విగ్ర‌హం ఏఎంబీ సినిమాలో ఉంటుంద‌ని స‌మాచారం. వ్యాక్స్ స్టాచ్యూ లాంచింగ్ ఈవెంట్‌ని ఘ‌నంగా జ‌ర‌పాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. అయితే ఆ మధ్య మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం ఎలా ఉంటుందో చిన్న న‌మూనాతో చూపించారు శిల్పి ఇవాన్ రీస్. ఇందులో మ‌హేష్ హెయిర్ స్టైల్ స‌రికొత్త‌గా ఉండగా, ఇది అభిమానుల‌ని ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మహ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles