తండ్రితో స‌ర‌దాగా ..

Fri,June 22, 2018 10:14 AM
mahesh wife shares sitara video via instagram

సూప‌ర్ స్టార్ మహేష్ త‌న‌య సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. త‌న తండ్రి సినిమాలోని పాట‌ల‌కు స్టెప్పులేయ‌డ‌మే కాదు, డైలాగుల‌ను కూడా ముద్దుగా ముద్దుగా ప‌లుకుతుంది. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ మూవీ షూటింగ్ లొకేష‌న్ కి వెళ్లి అక్కడ సితార చేసే సంద‌డి టీం మెంబ‌ర్స్ కి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇటీవల కొర‌టాల శివ తెర‌కెక్కించిన భ‌ర‌త్ అనే నేను మూవీ సెట్స్‌కి కూడా వెళ్ళిన సితార అక్క‌డ ఫుల్ హంగామా చేయ‌డంతో పాటు యూనిట్ స‌భ్యుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది. అయితే రీసెంట్‌గా మ‌హేష్ త‌న కూతురితో క‌లిసి ఆనందక్ష‌ణాల‌ని గ‌డిపారు. సితార ఎక్స్‌ప్రెష‌న్స్ తాను ట్రై చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా కోసం డెహ్రాడూన్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.4057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles