హిమాదాస్‌పై ప్ర‌శంస‌లు కురిపించిన మ‌హేష్,ఎన్టీఆర్,చెర్రీ

Sat,July 14, 2018 11:41 AM
mahesh praise hima das

ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించిన సంగ‌తి తెలిసిందే. 400మీటర్ల ఫైనల్లో 51.46 సెకండ్లలో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది. హిమాదాస్ స్వర్ణం సాధించడంపై ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా సూప‌ర్ స్టార్ మహేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా హిమాదాస్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. హిమాదాస్ గొప్ప ఘ‌న‌త సాధించింది. భారత క్రీడల చరిత్రలో చెప్పుకోద‌గ్గ క్ష‌ణం ఇది. మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను . మీకు నా అభినంద‌న‌లు అని త‌న ట్వీట్ ద్వారా తెలిపారు మ‌హేష్ . త‌న 25వ సినిమాతో బిజీగా ఉన్న మ‌హేష్ రీసెంట్‌గా 24 రోజుల డెహ్రాడూన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. త‌దుప‌రి షెడ్యూల్ కోసం త్వ‌ర‌లో అమెరికా వెళ్ల‌నున్నాడు. మ‌హేష్ తాజా చిత్రం వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తుంది. అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

కొత్త చ‌రిత్ర సృష్టించిన హిమ‌దాస్‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణం నెగ్గిన అథ్లెట్‌గా నిలిచారు. ఇది గొప్ప సంతోష‌క‌ర స‌మ‌యం’ అని ఎన్టీయార్ ట్వీట్ చేశాడు.మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు. ప్ర‌పంచ జూనియ‌ర్ చాంపియ‌న్ షిప్‌లో ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన తొలి భార‌తీయురాలు హిమ‌దాస్‌. దేశం యావ‌త్తు మీకు సెల్యూట్ చేస్తోంది’. అని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రామ్‌చ‌ర‌ణ్ పోస్ట్ చేశాడు.3022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles